Home South Zone Andhra Pradesh మతసామరస్యానికి ప్రతీకగా జనసేన ఇఫ్తార్ విందు.

మతసామరస్యానికి ప్రతీకగా జనసేన ఇఫ్తార్ విందు.

0

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆదివారం మదనపల్లెలో పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

స్థానిక టిప్పు సుల్తాన్ మసీదు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా, మానవత్వమే పరమావధిగా సాగడమే జనసేన లక్ష్యమని, పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని, ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.

NO COMMENTS

Exit mobile version