Home South Zone Telangana పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?

పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?

0

హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అయితే, ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై 50 శాతం వరకు అదనపు ఛార్జీలు విధించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
ఈ నెల 19న ఉగాది, 21న రంజాన్ పండుగలు ఉండటంతో, 17, 18 తేదీల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే పండుగలు ముగిసిన తర్వాత 23న తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో, ఆ రోజుల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది.
ఈ క్రమంలో, రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తూ, వాటిపై సాధారణ ఛార్జీలకు అదనంగా 50 శాతం వరకు పెంచిన చార్జీలు వసూలు చేయనున్నట్లు సమాచారం.
అయితే, పండుగల సమయంలోనే అదనపు భారం మోపడం సరైంది కాదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఈ నిర్ణయం మరింత ఒత్తిడి తెస్తుందని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సేవలను విస్తరించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
#Sidhumaroju
Alwal

NO COMMENTS

Exit mobile version