Home South Zone Telangana బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు

బాచుపల్లిలో ఫార్మా బస్సు బోల్తా 10 మందికి గాయాలు

0

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ఉద్యోగులకు గాయాలయ్యాయి.

ఈరోజు ఉదయం కూకట్‌పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో బస్సు గడ్డపోతారంలోని కంపెనీకి బయలుదేరింది. మార్గమధ్యంలో బాచుపల్లి సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు పక్కకు బోల్తా పడింది.

NO COMMENTS

Exit mobile version