Home South Zone Telangana నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు: కేసీఆర్ హర్షం.

నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు: కేసీఆర్ హర్షం.

0

కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా అందించే, అత్యున్నత సాహిత్య పురస్కారం ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -2025’ ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, నందిని సిధారెడ్డి గారికి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.

‎ఈ సందర్బంగా నందిని సిధారెడ్డి గారిని అభినందిస్తూ కేసీఆర్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

‎కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కున్న సంక్షోభాన్ని, ముఖ్యంగా మానవ సంబంధాల విచ్చిన్నతలను కవిత్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి ‘అనిమేష’కు ఈ అవార్డు రావడం గొప్ప విషయం అని అన్నారు.

‎తెలంగాణ మట్టివాసన తెలిసిన కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన, తెలంగాణ గర్వించదగ్గ కవి నందిని సిధారెడ్డి అని అన్నారు.

‎మెదక్ జిల్లా కేంద్రంగా మంజీరా రచయితల సంఘం ఏర్పాటుచేసి, అన్ని వర్గాల ప్రజా సమస్యలు, సామాజిక సమానత్వం కోసం రచనలు చేస్తూ తమ కలాన్ని గళాన్ని విప్పారని తెలిపారు.

‎తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తన పాట సాహిత్యం ద్వారా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉద్యమ కవిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని సిధారెడ్డి చూరగొన్నారని తెలిపారు.

NO COMMENTS

Exit mobile version