చింతూరులో ‘ డ్రోన్ ‘ నెక్స్ట్ లెవల్ నిఘా 8 మంది అరెస్ట్

0
3

చింతూరులో ఆదివారం సరదాగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారికి పోలీసులు డ్రోన్ కెమెరాలతో షాక్ ఇచ్చారు. ఎవరూ చూడటం లేదనుకుని గ్రామ శివార్లలో సిట్టింగ్ వేసిన 8 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేశారు.

ఎస్ఐ సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ.. ఇకపై నిఘా మరింత కఠినంగా ఉంటుందని, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ఆయన ప్రజలను కోరారు.

 

# Yadagiri