మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం “పూలే-మండల్ భవన్”లో శనివారం, బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ “బీసీ ధర్మ దీక్ష” పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కఠోర దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సోదరులు, ప్రజలు సంఘీభావం తెలిపారు# తురుమురళి.










