అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ వంశీ కృష్ణ.

0
1

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉంటామని ప్రతినబూనారు.