టిటిడి కళ్యాణ మండపం నుండి ర్యాలీ గా వెళ్లి ముక్కోనపు పార్కు, పేరాల ఈపురుపాలెం తోటవారిపాలెం వేటపాలెం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భారత రాజ్యాంగ శిల్పి, సమానత్వ సమాజానికి మార్గదర్శకుడు, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి వినమ్ర నివాళులు అర్పించిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య,చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్, యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్.
అణగారిన వర్గాలకు స్వరంగా నిలిచి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు అందించిన గొప్ప నాయకుడు ఆయన.విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని నమ్మిన బాబాసాహెబ్ స్ఫూర్తితో, మన చీరాల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు మనం కట్టుబడి పనిచేద్దాం.కులం, మతం అనే భేదాలకు అతీతంగా, మానవత్వాన్ని ప్రధానంగా తీసుకుని ముందుకు సాగే ఈ ప్రయాణంలో అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేద్దాం.










