మంచిర్యాల నియోజకవర్గం : ఇటీవల జరిగిన 2026-27 మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో నూతనంగా ఎన్నికైన జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్త సత్తయ్య గారు మరియు ప్రధాన కార్యదర్శి అవునూరి సత్తయ్య మరియు కమిటీ సభ్యులు, న్యాయవాదులు ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు..ముందుగా ఎమ్మెల్యేను గజమాల వేసి ఘనంగా సన్మానించారు.










