ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరికి వినతి పత్రం సమర్పించారు. అనుమతి లేకున్నా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ, భారీ ఫీజులతో విద్యను వ్యాపారంగా మార్చుతున్నారని నాయకులు సోమన్న, షాబీర్ బాషా మండిపడ్డారు.
అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని విమర్శించారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే విద్యాసంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.










