అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కింద వచ్చిన అర్జీలను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని, నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.










