చాలివేంద్రం దగ్గర రాగి అంబలి (జావా) పంపిణీ

0
6

మానవసేవ యే మాధవసేవ అంటూ బొల్లు వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో రాగి అంబలి పంపిణి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలోని ప్రధాన రహదారిపై తిరుమణి రాఘవేందర్ గౌడ్ ఏర్పాటు చేసిన చలివేంద్రం దగ్గర తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామనికి చెందిన బొల్లు వెంకటయ్య యాదవ్ ఆధ్వర్యంలో వేసవి కాలం ప్రజల దాహార్తి తీర్చడానికి బాటసారిలకు వాహనం దారులకు రాగి అంబలి పంపిణి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బొల్లు వెంకటయ్య యాదవ్ మాట్లాడుతూ.

వెల్జాల్ గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేసిన రాఘవేంద్ర గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల దహర్తిని తీర్చడానికి మంచి ఆలోచనతో ఏర్పాటుచేసిన చలివేంద్రం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామంలోని ఎస్ బి ఐ బ్యాంకు దగ్గరికి వచ్చిన ప్రజలు చల్లటి నీరు,మాజీగా,అంబలి తాగి వారి దాహార్తిని తీర్చుకుంటున్నారు.గ్రామంలో గెలిచిన ఓడిన ప్రజా అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుమణి రాఘవేందర్ గౌడ్,విజయ్ యాదవ్,బొల్లు వినోద్ యాదవ్,మొగిలి చేట్టి లింగం, సాయి, ఆరిఫ్,సతీష్ చారి,షాఫీ, ,పృద్వి,గ్రామస్తులు,యువకులు,తదితరులు పాల్గొన్నారు.