మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర శివార్లలోని అల్వాల్.. బొల్లారం పరిసర ప్రాంతాల్లో వాహన దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస చోరీలతో స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల బైకులు అపహరణకు గురయ్యాయి.
అల్వాల్ ఎస్ఐ తరుణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఓల్డ్ అల్వాల్‌లోని మంగాపురం కాలనీ ఫేజ్-3లో నివసించే కొల పోచయ్య, తన ఇంటి ముందు పార్క్ చేసిన హోండా సిబి యూనికార్న్ (TS10EK 7536) బైక్ దొంగతనానికి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో.. బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని బర్టన్ గూడ వద్ద షాకింగ్ చోరీ జరిగింది. రోడ్డా శ్రీకాంత్ అనే వ్యక్తి తన యాక్టివా (TS 09 EB 2085) వాహనాన్ని బాలాజీ స్వీట్ హౌస్ ముందు నిలిపారు. అయితే పొరపాటున బండికి తాళం వేయడం మర్చిపోయి లోపలికి వెళ్లారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆ బండిని ఎత్తుకెళ్లారు.
ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని ఆల్వాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వాహనదారులు తమ వాహనాలకు విధిగా లాక్ వేసుకోవాలని, సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లోనే పార్క్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
#sidhumaroju
Alwal










