మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ విభాగంలో సమ్రీన్ 980, బి. రోహిణి 976 మార్కులు సాధించగా.
బైపీసీలో సోఫియా ఫిరడోస్ 962, నిహారిక 941 మార్కులు పొందారు. సీఈసీలో రమాదేవి 896, శారదా 884, హెచ్ఈసీలో నాగమణి 958 మార్కులతో మెరిశారు. కళాశాల మొత్తం 80% ఉత్తీర్ణత సాధించడం విశేషం. ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.









