జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మదనపల్లిలో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని బుధవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
మదనపల్లె అగ్నిమాపక కేంద్రం నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 101కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.








