పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి నియమితులయ్యారు. గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు.
తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి ఉద్యోగ, పెన్షనర్లకు న్యాయం చేస్తానని వరద రెడ్డి పేర్కొన్నారు# కొత్తూరు మురళి.










