ఏప్రిల్ 25-26న అన్నమయ్య జిల్లా జర్నలిస్టుల ఎన్నికలు.

0
5

మదనపల్లెలో ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ (ఎలక్ట్రానిక్ మీడియా) అన్నమయ్య జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి 23 వరకు సభ్యత్వ నమోదు.

24న ఓటర్ల జాబితా విడుదల ఉంటుంది. 25న నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు పూర్తి చేసి సాయంత్రం తుది జాబితా విడుదల చేస్తారు. 26న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించనున్నారు.