అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి విద్యార్థిని క్యాతిప్రియ, 500 మార్కులకు
491 సాధించి మండలం టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమా ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కేక్ కట్ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంఈఓ నటరాజన్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










