బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలాన్ని పర్యటించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, దిగుపల్లె, కాగతి, ఏ కొత్తకోట గ్రామాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన చెరువులు, వాటికి సంబంధించిన సప్లై ఛానల్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలధార కార్యక్రమం అమలు తీరుపై డిప్యూటీ ఎంపీడీవోను ఆరా తీశారు. ఈ పర్యటనలో పలువురు అధికారులు పాల్గొన్నారు# పుత్తూరు మురళి.










