నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర విజన్ 2047” కార్యక్రమంలో భాగంగా నేడు చీరాల పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ నందు మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆర్డిఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్,కూటమి నాయకులు పాల్గొన్నారు.ప్లాస్టిక్‌ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడుకుందాంపర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనీ, ఒక్కసారి ఉపయోగించి పారేస్తున్న ప్లాస్టిక్ వస్తువులు ఏళ్ల పాటు ప్రకృతిలో కరుగకుండా ఉండి, మానవజాతికి, వన్యప్రాణులకు,సముద్ర జీవరాశికి ముప్పుగా మారుతున్నాయని,ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సూచించారు.మనం తీసుకునే చర్యలు రేపటి తరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తించి, పరిశుభ్రతపై మనం చూపే శ్రద్ధ వారికి మంచి జీవన వాతావరణాన్ని అందించడంలో కీలకమవుతుందన్నారు.










