అన్నమయ్య జిల్లా ఆదాయం పెంపుపై కలెక్టర్ దృష్టి.

0
3

మదనపల్లిలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఖజానా ఆదాయం పెంచే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆదాయ పురోగతిని సమీక్షించారు.

జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపల్, పంచాయతీ పనుల్లో తప్పనిసరిగా అమలు చేయాలని, బిల్లులు ప్రాసెస్ చేసేటప్పుడు జీఎస్టీ స్థితిని పరిశీలించాలని సూచించారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన నిఘా పెట్టి, ఇతర రాష్ట్రాల నుంచి సరఫరాను అరికట్టాలని చెప్పారు.