మదనపల్లి: గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: వెంకటప్ప.

0
4

మదనపల్లిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వి. పి వెంకటప్ప మాట్లాడుతూ, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని
సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి 100 శాతం చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. గిరిజన కాలనీల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, గృహాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆధార్ లేమితో పింఛన్లు, రేషన్ అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ప్రత్యేక శిబిరాలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని చెప్పారు.