తిరువూరు న్యాయవాదుల విధుల బహిష్కరణ అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది కే చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అన్యాయంగా దారుణంగా కొట్టడాన్ని ఖండిస్తూ సదరు పోలీసుల మీద కఠిన చర్యలు వెంటనే చట్ట ప్రకారం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ న్యాయవాదులు తమ విధులను
బహిష్కరించి నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరువూరు న్యాయవాదుల సంఘము ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, సెక్రటరీ కనపర్తి రాంబాబు, సీనియర్ న్యాయవాదులు చింతల వెంకటరెడ్డి నాగ బండి రామకృష్ణ, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, అంకిరెడ్డి అంజన్ రెడ్డి, రాజవరపు శ్రీనివాసరావు, పల్లెపాటి శ్రీనివాసరావు, వాకధాని లక్ష్మీనారాయణ, కొత్తపల్లి ఆనంద స్వరూప్, మలవత్ రాము,షేక్ గౌసుద్దీన్, చిలకా హేమంత్, బండ్రపల్లి నవీన్, కారుమంచి సునీల్, భూక్యారామారావు, పినపాటి నరసయ్య,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.










