ప్రగతి బాటలో పల్లెలు |

0
2

ప్రగతి బాటలో పల్లెలు: మైలవరంలో అభివృద్ధి పండగ

మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పల్లె పండుగ 2.0లో భాగంగా విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు తాడేపల్లిలో రూ.92 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రెయిన్లు, గోకులం షెడ్లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ మౌలిక వసతులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నియోజకవర్గవ్యాప్తంగా సీసీ రోడ్ల కోసం రూ.32.92 కోట్లు కేటాయించామని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ చైర్మన్ నెట్టెం రఘురాం, జనసేన నేత అక్కల రామ్మోహనరావు పాల్గొన్నారు