అసాంఘిక కార్యకలాపాలపై విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం.

0
1

అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. బలవంతపు మతమార్పిడులు.సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే కుట్రలపై ఆందోళన వ్యక్తం చేశారు.

హిందూ యువతులపై వేధింపులను అరికట్టేందుకు కఠిన కేంద్ర చట్టం తీసుకురావాలని, ప్రభుత్వ, రైల్వే, అటవీ భూముల ఆక్రమణలను తొలగించాలని, దేశ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి ప్రతినిధులు పాల్గొన్నారు.