ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మేయర్

0
2

మంచిర్యాలలో ఈశ్వర్ ప్రసాద్ స్మారక ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ టోర్నమెంట్‌ను మేయర్ ధరణి మధుకర్ ఘనంగా ప్రారంభించారు. మొత్తం 32 జట్లు పాల్గొంటున్న ఈ పోటీలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భోజన వసతి కల్పించగా, ప్రముఖ సంస్థలు నగదు బహుమతులను స్పాన్సర్ చేశాయి. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, మంచిర్యాల సాయికుంటలో 14 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఈ స్టేడియం అందుబాటులోకి వస్తుందని, తద్వారా అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.