నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారత దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కంటేశ్వర్ బస్తి హిందూ సమ్మేళన కార్యక్రమం 21 మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమం గురించి ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో
భాగంగా రైల్వే కమాన్ శాస్త్రి గణేష్ మండపం నుండి ప్రారంభమై బ్యాంకు కాలనీ కురుమ కాలనీ వరకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ నాగోల్ల లక్ష్మీనారాయణ గారు మరియు హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు గంగుల విజయ గారు కార్యదర్శి నాగోల రవి గారు మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.










