రామాయంపేట మండల కేంద్రంలోని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్ఫెడ్ డీఎం సునీత సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న మొక్కల కొనుగోళ్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని పలు రికార్డులను తనిఖీ చేసిన ఆమె, కొనుగోలు ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కల కొనుగోళ్లు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.










