బసవేశ్వర ఆలయానికి ఈరోజు ఉత్సవాలు సిద్ధం

0
2

జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న ఆలయం నామకరణ ఉత్సవానికి సిద్ధమైంది. ప్రతి ఏడాది అక్షర తృతీయ  రోజున రాష్ట్రవ్యాప్తంగా  బసవేశ్వరు డి జయంతి నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఇక్కడ ఆలయంలోని నందికి నామకరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నందికి ఉయ్యాల ఊపి  నామకరణం చేస్తారు. వార్ కారీలు ‘అఖండ హరినామ సప్త’ పేరిట ఏడు రోజుల పాటు నిత్యభక్తి, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జుక్కల్ నియోజకవర్గాలతో పాటు  వివిధ ప్రాంతాల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ లో భక్తులు బస్వాపూర్ లోని బసవన్న ఆలయానికి వచ్చి నందికి పూజలు చేస్తారు.

                                                రిపోర్టర్: శివాజీ.