తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!

0
5

హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది.

‎ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న రాథోడ్ బాపురావు ఆదివారం నాడు బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరారు. కవిత గారు ఆయనకు కండువా కప్పి సంస్థలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన, అనూహ్యంగా జాగృతి వైపు అడుగులు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.