నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు: సీఐ

0
2

అశ్వారావుపేటలో సీఐ నాగరాజు రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. చట్టాలను గౌరవించినప్పుడే ప్రజలకు రక్షణ ఉంటుందని.

నిబంధనల ఉల్లంఘన సమాజానికి ముప్పుగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేని 50 వాహనాలను గుర్తించి, యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐలు యయాతి రాజు, అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.