పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన

0
1

పుంగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జ్ సురేశ్ బాబు

వైద్య సిబ్బందికి అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్బన్ డయాక్సైడ్, డ్రై కెమికల్ పౌడర్ వాడకంపై సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సెక్యూరిటీ, ఆసుపత్రి, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.