విద్యా మనిషికి గౌరవానీ తెస్తుంది.

0
0

కౌకుంట్ల మండలం లోనీ పేరూరు గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ 75 వ వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్య అతిధి గా విచ్చేసిన దేవరకద్ర నియోజకవర్గ MLA G మధుసూదన్ రెడ్డీ గారు విద్యార్థులనీ ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో గౌరవ మర్యాదలు కేవలం విద్యా వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని అందువలన ప్రతి ఒక్కరికీ

విద్యా అనేది చాలా ముఖ్యమైన అంశగా వర్ణించారు. విద్యా కోసం  ఎంత వరకు అయినా పని చేస్తా అని  ఈ సందర్భంగా పేరూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను జూనియర్ కళాశాల గా ప్రభుత్వం తో మాట్లాడి ప్రమోట్ చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు కేవలం విద్యా మాత్రమే కాకుండా స్పోర్ట్స్ మీద కూడా దృష్టి పెట్టాలని అందుకు సంబంధించి కోకో వాలీబాల్ కబడ్డీ కి సంబంధించిన వాటిని వెంటనే అందేలా చేస్తానని మాట ఇచ్చారు. చుట్టూ ప్రకల ఉన్న గ్రామాల విద్యార్థులకు అనుగుణంగా పేరూరు గ్రామంలో ఒక మినీ స్టేడియం ఏర్పాటు కు కూడా ప్రక్కనే ఉన్న mp గారిని కోరడం జరిగింది.  ఈ  కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున్న నిర్వహించిన పూర్వ విద్యార్థులకు గ్రామ పెద్దలు ప్రజలకు అభినందనలు తెలియజేశారు.