అన్నమయ్య జిల్లాలో ‘జలధార’ ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది. కలెక్టర్ నిషాంత్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా
దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, ‘జలధార-జలహారతి’ కార్యక్రమానికి కలెక్టర్ నిషాంత్ కుమార్ ను నోడల్ అధికారిగా నియమించారు. ఆయన మార్గదర్శకత్వంలో భూగర్భ జలాల పెంపుపై కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు.










