జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

0
2

అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం

మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్

నందిగామ,ఏప్రిల్,20,(భారత్ అవాజ్ ): వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా కృషి చేస్తున్న అయ్యప్ప సేవా సమితి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎండి జాఫర్ ప్రశంసించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నందిగామ ఆర్టీసీ బస్టాండ్ లో సోమవారం మజ్జిగ పంపిణి కార్గో ఏజెంట్ ఆన్లైన్ రిజర్వేషన్ కౌంటర్ నిర్వాహకులు ఎండి జాఫర్ గురుస్వామి కొప్పు రమేష్ బాబు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి నిర్వహకులు నిత్యం చేస్తున్న కార్యక్రమాలు సేవకు నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నిర్వహకులు, తదితరులు పాల్గోన్నారు.