పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం నేడు మృత్యుంజయ హోమం.

0
4

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ నేడు (ఏప్రిల్ 21న) కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ఈ పూజలు ప్రారంభం కానున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్‌కు శనివారం హైదరాబాద్‌లో శస్త్రచికిత్స జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ నిర్వహించే ఈ హోమానికి కూటమి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.