మైలవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి, ‘నో వేకెన్సీ’ బోర్డులు పెట్టడమే లక్ష్యమని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా, జి.కొండూరు మండలం కుంటముక్కల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్లో ప్రతిభ చూపిన 157 మంది విద్యార్థినులకు రూ.8.20 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఎమ్మెల్యే సతీసమేతంగా అందజేశారు.
శిథిలావస్థకు చేరిన ఈ గురుకుల పాఠశాలను రూ.5 కోట్లతో పునఃనిర్మాణం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. కలెక్టర్ జి.లక్ష్మీశ, తేజస్వి పొడపాటి గారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, పేద బిడ్డల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.










