పెదవడ్లమూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

0
0

నవ్యాంధ్ర రాజధాని రూపకర్త, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు .

నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు. మౌలిక వసతులు, పారదర్శక పాలన, యువతకు ఉపాధి కల్పనలో సీఎం చూపిన దూరదృష్టి రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో గ్రామ పార్టీ అధ్యక్షులు యేళ్ళ శివరామయ్య మరియు భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.