వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం: గంగోలు శ్రీనివాసరావు

0
0

వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం : గంగోలు శ్రీనివాసరావు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ని కలిసిన వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు

నందిగామ ఎన్టీఆర్ జిల్లావైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుని ని పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గంగోలు శ్రీనివాసరావు ప్రజల్లో వైసీపీ పార్టీ బలోపేతంపై సమావేశ మయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలం అవుతారని, అందరూ ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే మందు తోక జగన్ మోహన్ రావు…. సూచించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత గంగోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి నియోజక వర్గంలో వైఎస్ఆర్సిపి సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంతో పనిచేస్తామని, నియోజకవర్గస్థాయి సమావేశాలతో మరింత బలోపేతం చేసి ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి డివిజన్ స్థాయి కమిటీల్ని ఏర్పాటుతో బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని, గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత కల్పించి కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో వైసిపి పార్టీ మరింత బలపడి భారీ మెజార్టీతో గెలవబోతుందని తెలిపారు.