హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్: డీఎస్పీ పావని.

0
1

మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11న సీటీఎం రోడ్డులో తట్టివారిపల్లి చెరువు కట్టపై శంకర్ హత్యకు గురయ్యారు.

దర్యాప్తులో రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్ (25), వినయ్ కాంత్ (25)లను నిందితులుగా గుర్తించారు. ఆదివారం వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, గొడవ కారణంగా శంకర్‌ను బండరాయితో కొట్టి హత్య చేసినట్లు నేరాన్ని అంగీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.