22-A భూ సమస్యలకు చెక్… రైతులకు ఊరట.

0
1

మదనపల్లిలో 22-ఎ భూ సమస్యల పరిష్కారానికి అన్నమయ్య జిల్లా యంత్రాంగం సోమవారం వేగం పెంచింది. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆధ్వర్యంలో పెండింగ్ కేసులను పరిశీలించి పది మంది రైతులకు ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. సర్వే నంబర్ సవరణలు, అడంగల్ లోపాలు వంటి సమస్యలు పరిష్కరించడంతో రైతులకు ఉపశమనం లభించింది.

భూమి రికార్డులు సరిచేయడం ద్వారా రుణాలు, లావాదేవీలు సులభమవుతాయని తెలిపారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు.