కోదాడ నియోజకవర్గంలోని మోతే మండలం రాయకుంట తండా వద్ద అక్రమ ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న కానిస్టేబుల్ కృష్ణంరాజుపై దుండగులు దాడికి తెగబడ్డారు, విధి నిర్వహణలో ఉన్న ఆయనపై ఇద్దరు డ్రైవర్ల విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై మోతే పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్సై మీడియా వారికి తెలియజేయడం జరిగింది.










