తమిళనాడులో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం

0
2

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా తళిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు దేశాభివృద్ధికి అవసరమని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని, ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి తమిళ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, డీఎంకే పార్టీల వైఖరిని ఆయన ఎండగట్టారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని కావేరి వరకు తెస్తామని హామీ ఇచ్చారు. తళి నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం కల్పిస్తామని, రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.