పలమనేరులో విద్యార్థులతో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ

0
3

2026 ఏప్రిల్ 21, మంగళవారం పలమనేరు నియోజకవర్గంలో జిల్లా ఎస్పీ తుషార్ డుడి ఆదేశాల మేరకు, డీఎస్పీ డేగల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బైరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

బైరెడ్డిపల్లి ఎస్సై చందన ప్రియ, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ బృందం ఈ ర్యాలీని చేపట్టారు. కార్యక్రమంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, బైరెడ్డిపల్లి పోలీస్ సిబ్బంది, హ్యూమన్ రైట్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.