మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లి ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న సిగ్నేచర్ ఎగ్జిబిషన్‌కు మున్సిపల్ అనుమతులు లేవని క్లాత్ రెడీమేడ్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం నిరసన తెలిపారు.
అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్ నిర్వహించడం సరికాదని, నిర్వాహకులు అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










