మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని జొన్నబండలో ‘శ్రీ వారాహి టీ ప్యాలెస్’ ఘనంగా ప్రారంభమైంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ నూతన టీ షాపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి టీ రుచులు అరుదుగా లభిస్తాయని టీ చాలా రుచికరంగా ఉందని కితాబు ఇచ్చారు. నాణ్యమైన సేవలు అందించే ఇలాంటి వ్యాపారాలు మరిన్ని రావాలని, యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. షాపు యజమాని రాచకొండ వెంకటేష్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
యజమాని వెంకటేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చేతుల మీదుగా తమ టీ ప్యాలెస్ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని, కస్టమర్లకు నాణ్యమైన రుచిని అందిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డోలి రమేష్, చెలిమెల మహేష్, నార్ల సురేష్‌తో పాటు స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










