మదనపల్లెలో బుధవారం నాడు జరిగిన ఘటనలో, నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు లక్ష్మమ్మ, మునిస్వామి నాయక్‌లకు రూ. 7 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు.
అలాగే 30 గ్రాముల బంగారాన్ని కూడా అవసరాల కోసం ఇచ్చినట్లు ఆరోపించింది. తీసిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడగడంతో అత్తమామలు, వారి కుమార్తె గాయత్రి కలిసి దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.










