కౌకుంట్ల మండలంలో ఉన్నటువంటి ముచ్చింతల, అప్పంపల్లి, దాసరపల్లి, తిరుమలాపూర్ గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్ళు గత 3 రోజుల నుంచి రావడం లేనందున ఆ యా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయంలో ఎం పీ డి వో లక్ష్మీనరసింహ ను వివరణ కోరగా నీటి సమస్య ఉందనే విషయం తమ దృష్టి కి రాలేదు అని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లగా గత మూడు రోజులుగా నీళ్ళు సక్రమంగా రావడం లేదని వివరించారు.
ఇదే విషయం పై మిషన్ భగీరథ ఏ ఈ మహేష్ ను సంప్రదించగా నీళ్ళు సక్రమంగానే వస్తున్నవనీ వివరణ ఇచ్చారు. ఇలా ఒక్కో అధికారి ఒక్కో సమాధానం చెప్పడం గమనార్హం.









