తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
నివేదికను రూపొందించే ముందు మాజీ సీఎం కేసీఆర్ మరియు ఇతరుల వాదనలను సరిగా పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘోష్ కమిషన్ పేరుతో, పిల్లర్లను రిపేర్ చేయించకుండా నాటకాలాడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టులాంటి తీర్పు.
ఈ విచారణ నివేదిక చెల్లదని కోర్టు స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ, న్యాయపరమైన షాక్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను కొనసాగిస్తూనే, ఇప్పుడు ఏకంగా నివేదికనే కొట్టివేసింది.









