ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం

0
2

ఓటుకు నోటు కేసులో  మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది.

ఈ ధర్మాసనంలో జస్టిస్ విజయ్ బిష్ణోయ్ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కేసు విచారణ జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో రెండు కీలక పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసినది